![]() |
![]() |

బుల్లితెర మీద రవికిరణ్-సుష్మ కిరణ్ గురించి అందరికీ తెలుసు. వీళ్ళు రీసెంట్ గా గోవా ట్రిప్ వెళ్లారు. ఐతే ఈ గోవా ట్రిప్ కి అసలు ఖర్చు ఎంతయ్యింది...ఎం చేశారు వంటి ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్ అడిగారు. దానికి రవి-సుష్మ ఆన్సర్స్ చెప్పారు. తమ ట్రిప్ కి మొత్తం 88 వేలు ఖర్చయినట్టు చెప్పారు. గోవాని నవంబర్, డిసెంబర్, జనవరి ఎండింగ్ వరకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కొంతమంది గోవాలో దెయ్యాల్ని చూసారా అని అడిగేసరికి రవి-సుష్మ కూడా మొదట ఎందుకు ఇలా అడుగుతున్నారా అని అనుకున్నారట. అవును ఆ ఎక్స్పెరియన్సు జరిగింది.. దెయ్యమా, స్పిరిటా ఏమో కానీ ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ ఐతే కలిగిందని చెప్పాడు రవి కిరణ్. మూడో రోజు బీచ్ కి వేరే ప్లేసెస్ కి బాగా తిరిగే టైంలో ఇలా జరిగింది.
బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసాక షాపింగ్ కి వెళ్లి వచ్చాక దెయ్యం ఐతే కనిపించింది. అది దెయ్యమా, ఆత్మా, దేవుడా అనేది తెలీదు కానీ కొంచెం భయమేసింది అని చెప్పాడు రవి కిరణ్. ఐతే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు కూడా ఎవరో వచ్చి వెళ్లిన ఒక ఫీలింగ్ వచ్చింది. ఇక లాస్ట్ రోజు అన్ని బీచెస్ తిరిగేసాం. అలిసిపోవడం వలనో ఏమో కానీ మా ఇమాజినేషన్ వలనో తెలీదు కానీ ఏదో నీడ వెనకే ఉన్నట్టుగా అనిపించింది. డోర్ తీస్తే నీడ కనిపించేది కాదు డోర్ వేస్తే నీడ కనిపించేది. ఎవరో నవ్వినట్టుగా శబ్దాలు వచ్చేవి..చుట్టూ చూస్తే ఎవరూ ఉండేవాళ్ళు కాదు...సుష్మని నిద్ర నుంచి లేపడానికి ట్రై చేసినా లేవలేదని చెప్పాడు రవికిరణ్. ప్రభంజన్ ని రూమ్ లో వదిలేసి వెళ్ళాక చాలా భయం వేసింది అని చెప్పారు రవి, సుష్మ. మంత్రాలయం వెళ్లి అక్కడ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. ఇలా సుష్మ కిరణ్ వాళ్లకు గోవాలో గోస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్తూ వాళ్ళ యుట్యూబ్ లో ఒక వీడియోని అప్ లోడ్ చేశారు.
![]() |
![]() |